Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
ఇల్లందు కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం ప్రదర్శన నిర్వహించి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం షేక్ యాకుబ్ షావలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో
కార్మిక జేఏసీ నాయకులు కే.సారయ్య, నబి, డి.ప్రసాద్, మహబూబ్, కోటయ్య, రామ్ సింగ్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 12న జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలన్నారు. తదితర సమస్యలను వివరించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జీఎంకు అందజేశారు. ఈ ధర్నాలో దేవర కొండ శంకర్, కొండపల్లి శ్రీను, తాళ్లూరి కృష్ణ వర్మ తదితరులు పాల్గొన్నారు.