Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని పెద్దనల్లబల్లి జిపిఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులకు సోమవారం ఇంగ్లీష్‌మీడియం పుస్తకాలను అందజేశారు. పీఓ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవతో అందజేసిన ఈ పుస్తకాలను పెద్దనల్లబల్లి సర్పంచ్ మట్టా వెంకటేశ్వరరావు చేతులమీదుగా అందజేశారు. 1వ తరగతి నుండి 5వ తరగతులకు చెందిన మొత్తం 108 మంది విద్యార్దులకు పుస్తకాలు అందజేశారు. దీంతో పాటు మోడల్ పాఠశాలకు గుర్తించి విద్యార్దులకు ఆట వస్తువులను సైతం ఐటిడిఏ నుండి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు కన్నయ్య, ఉపసర్పంచ్ మడకం భూపతి, ఉపాద్యాయులు వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, రమేష్, ఎస్సిఆర్పి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.