Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
మండల పరిధిలోని రాయిగూడెం వద్ద పోడు భూముల్లో ఫారెస్ట్ అధికా రులు కందకాలు తవ్వేందు కు సోమవారం ఆరు జేసీబీలతో చర్యలు చేపట్టా రు. ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వే విషయం సాయంత్రం తెలుసుకున్న స్థానిక పోడుసాగుదారులు ఆ ప్రాంతానికి చేరుకుని అడుగగా..'ఈరోజుకి పనిముగిసిందని, మిగతా పని రేపు ఉదయం ఉంటుందని చెప్పారని పలువురు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు ఇవ్వకముందే, తాము ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న పోడు భూములకు ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వటం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోడు భూములకు పట్టాలు ఇచ్చేంత వరకు అటవీశాఖాధికారులు కందకాలు తవ్వే చర్యలు నిలిపివేయాలని పలు సందర్భాల్లో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్వయంగా ఆదేశించి నప్పటికీ, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు నివేదించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు బేఖాతరు చేస్తూ ఇటువంటి చర్యలకు పాల్పడ టంతో పోడు సాగుదారులు ఇక తమ గోడు ఎవరికి చెప్పుకుంటే మా భూములు మాకు దక్కుతాయో! అనే సందిగ్ధంలో పడ్డారు.