Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎందరి నడకకో చేయూత
నవతెలంగాణ-పినపాక
అతడొక సామాజిక కార్యకర్త. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదివాసీ విద్యార్థులకు విద్యను అందించే బాల వెలుగు పాఠశాల ఉపాధ్యాయుడు. ఆయనే పినపాక మండలం సింగిరెడ్డి పల్లి పంచాయతీ దేవనగరం గ్రామానికి చెందిన తోలెం శ్రీనివాస్. దీనితోపాటు సామాజిక సేవా సంస్థలను సంప్రదించి ఆర్థికంగా లేక అనారోగ్యంతో బాధపడుతున్న వికలాంగులకు తనదైన శైలిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులు వివిధ కారణాల చేత కాళ్లు కోల్పోయారు. వికలాంగులుగా మిగిలిన వారిని నేనున్నానంటూ విజయవాడలోని రోబోటిక్ రిహాబిలిటేషన్ సెంటర్ను సంప్రదించి, రూపాయి ఖర్చు లేకుండా రూ.లక్ష యాభై వేల ఖర్చు అయ్యే కృత్రిమ కాలును, సుదీక్ష ఫౌండేషన్ నిర్వాహకురాలు విమలతో మాట్లాడి అమర్చారు. ఇటీవల అమరారం పంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన బిజ్జా రమేష్ వాహన ప్రమాదంలో తన ఎడమకాలును కోల్పోయి, అంగవైకల్యంతో బాధపడుతున్న సమయంలో, విషయాన్ని విజయవాడలోని సామాజిక సేవా సంస్థ వారికి తెలియజేయగా, రెండు రోజుల క్రితమే అతనికి కాలును అమర్చారు. ఈ సందర్భంగా బిజ్జా రమేష్ మాట్లాడుతూ అంగవైకల్యంతో బాధపడుతున్న నాకు, ఆపద్బాంధవుడుగా నిలిచి, కృత్రిమ కాలు అమర్చడానికి సాయం చేశారని, జన్మజన్మలకు తోలెం శ్రీనివాస్ చేసిన సాయాన్ని మరువలేనని, ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలియజేశారు. శ్రీనివాస్ చేసిన ఈ సహాయాన్ని మండల ప్రజలు శభాష్ అని అంటున్నారు.