Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
అ తండా సందర్శనలో టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణ
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని కొత్తగూడెం, పాకాల ప్రధాన రోడ్లపై అనుమతులు లేని ఫంక్షన్ హాల్స్, పెద్దపెద్ద భవనాలు నిర్మాణమవుతున్న పట్టించుకోని తహసీల్దార్ పేద గిరిజన ఇండ్లు కూల్చడం దారుణమని ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ అన్నారు. సీఎస్పీ బస్తి గ్రామపంచాయతీ రాజీవనగర్ వద్ద గల సున్నం రాజయ్య నగర్లో ఇల్లు కూల్చివేతపై గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడారు. ముందుస్తూ నోటీసులు కూడా ఇవ్వకుండా తహసీల్దార్, పోలీసులు ఈ రకంగా కూల్చడం సరి కాదని అన్నారు. ఈ సమస్యను మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని ఏజెన్సీలో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాని కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని అన్నారు. ఈ పరిశీలన బృందంలో జిల్లా అధ్యక్షులు వజ్జ సురేష్, వ్యకాస నాయకులు ఆలేటి కిరణ్, రాందాస్, వాసం రాము, ఇర్ప బక్కయ్య, సుధా, లక్ష్మి, కృష్ణ, గుర్వమ్మా, కూమరి, పాపారావు, పాల్గొన్నారు.