Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జెవిఎల్.శిరీష
నవతెలంగాణ-కొత్తగూడెం
యుక్త వయస్సులో ఉన్న బాలికలకు రక్తహీనత రాకుండా చూసుకోవాలని, మంచి ఫౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రక్త హీనతను అరికట్టవచ్చని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జెవిఎల్.శిరీష అన్నారు.సోమవారం మున్సిపాలిటీ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పాత కొత్తగూడెం ఆధ్వర్యంలో 3వ వార్డులోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళల డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలకు రక్త హీనత పరీక్షా శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది, ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జె.వి.ఎల్.శిరీష మాట్లాడుతూ యుక్త వయస్సులో ఉన్న బాలికలు సరైన పౌష్టికాహారం భుజించాలని, శారీరక ఎదుగుదల, శరీర మార్పులు ఈ దశలో జరుగుతాయని, రక్త హీనత రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంసిహెచ్ ప్రోగ్రాం అధికారిణి డాక్టర్ డి.సుజాత, డాక్టర్ నిస్సి శారోన్, కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, పబ్లిక్ హెల్త్ మేనేజర్ పొన్నెకంటి సంజీవరాజు, వైస్ ప్రిన్సిపల్ విజయ, లెక్చరర్లు యశోద, సునీత, అనురాధ, ఎఎన్ఎంలు కమల, అరుణ, ఎల్టి నాగమణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.