Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జిల్లాపై టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
అ ఐదు నియోజక వర్గాలు మావే
అ గ్రూపులు లేవు...కేసీఆర్ వర్గం మాత్రమే ఉంది
అ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐదు నియోజక వర్గాలలో గెలుపు మాదేనని, జిల్లా కోటపై టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని టీర్ఎస్ జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం కొత్తగూడెం జెడ్పీ కాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయాన మాట్లాడారు. ముందుగా కొత్తగూడెం రైటర్స్ బస్తీ ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో నిర్మింస్తున్న పార్టీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. త్వరలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారభించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని టీఆర్ఎస్ శ్రేణులను కలుపుకుని ముందుకుపోతామని తెలిపారు. టిఆర్ఎస్లో అసమ్మతి లేదన్నారు. ఎవరైనా ఉంటే వారి గురించి రాష్ట్ర ముఖ్యమంతి కేసీఆర్ చూసుకుంటారని తెలిపారు. పోడు భూముల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. నేను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో యువతకు కొత్త జోష్ వచ్చిందని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పనిచేస్తామన్నారు. ప్రతి కార్యకర్తను కలుపుకుని పనిచేస్తామని తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, ఎమ్యెల్యే వనమా వెంకటేశ్వరరావు, జెడ్పీ వైస్ చైర్మెన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, మున్సిపల్ చైర్మెన్ కాపు సీతాలక్ష్మీ, వూకంటి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.