Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల పరిధిలోని బుచ్చన్నగుడెం గ్రామంలో గల ఆయిల్ ఫామ్ నర్సరిని భారతీయ ఆయిల్ ఫామ్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాల్లో తెలంగాణలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా చేసుకుని ఆ దశగా ప్రయత్నాలు సాగుతున్నాయి అని అదేవిధంగా 2022-2023 సంవత్సరానికి గాను 5 లక్షలు లక్ష్యంగా సంస్థ పని చేస్తుందని అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25 వేల మొక్కలు సరఫరాకు సిద్ధంగా ఉన్నాయి అని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ కూడా అందుబాటులో వుంది అని రైతులు ఎక్కువ మొత్తంలో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని చూసించారు. ఈ కార్యక్రమంలో భారతీయ ఆయిల్ ఫామ్ సంస్థ సీనియర్ శాస్త్రవేత్తలు రామచంద్రుడు ఉద్యాన పరిశోధన సంస్థ శాస్త్రవేత్త విజరు కృష్ణ ఉద్యాన పట్టు పరిశ్రమ జిల్లా అధికారి జీనుగు మరియన్న ఆయిల్ ఫెడ్ డివిజనల్ అధికారి ఉధరు కుమార్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి సంబధిత అధికారులు పాల్గొన్నారు.