Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) సంతాపం
నవతెలంగాణ-అశ్వారావుపేట
సాయుధ తెలంగాణ పోరాట యోధుడు రేగళ్ళ చెన్నారెడ్డి (90) అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. ఈయన గత కొన్నేండ్లుగా హృద్రోగంతో బాధపడుతున్నారు. చెన్నారెడ్డికి భార్య, ఇరువురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య మండల కమిటీ తరుపున విలేకరులు సమావేశం ఏర్పాటు చేసి సంతాపం ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల కన్వీనర్ చిరంజీవి, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు ఉన్నారు.