Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం చెందిన మారుతి నర్సింగ్ కళాశాలకు చెందిన 62 మంది విద్యార్థులకు హైదరాబాద్లోని ఏసియన్ ఇనిస్ట్యూట్ ఆసుపత్రులలో ఉద్యోగ నియామకాలు పొందినట్లు మారుతి నర్సింగ్ కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు తెలిపారు. ఏషియన్ ఇనిస్టి ట్యూట్లో గ్యాస్ట్రో ఎంట్రాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ విభాగాలలో 62 మంది నర్సింగ్ విద్యార్థినీలకు ఉపాధి అవకాశాలు లభించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్.ఎల్.కాంతారావు మాట్లాడుతూ నర్సింగ్ వృత్తి చాలా పవిత్రమైనదని ఆయన అన్నారు. ఉద్యోగంలో పొందిన వారు అంకితభావంతో సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఉద్యోగ నియామకం పొందిన విద్యార్థినులు మాట్లాడుతూ పేద కుటుంబానికి చెందిన మేము మారుమూల ప్రాంతాల నుండి వచ్చి మారుతి నర్సింగ్ స్కూల్లో చేరి కళాశాల నిర్వాహకుల సహకారంతో హైదరాబాదులోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, యురాలజి ఆసుపత్రిలో ఉద్యోగం పొందగలిగామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏషియన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, యురాలజీ ఆస్పత్రి డాక్టర్ చిరంజీవికి, మారుతి కాలేజీ నిర్వాహకులు డాక్టర్ యస్.యల్. కాంతా రావు, డాక్టర్ సుబ్బ రాజులకు ధన్యవాదాలు తెలిపారు.