Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
నవతెలంగాణ-పాల్వంచ
ఇప్పటికే రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించారని, ప్రజల శ్రేయస్సుకోసం మరోసారి సవరిస్తే తప్పేమిటని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖామంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. సోమవారం పాల్వంచకు వచ్చిన శ్రీనివాస్‌యాదవ్ కేటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లో విలేకర్ల సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. రాజ్యాంగాన్ని సవరించాలని వాజ్‌పేయి ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. విభజన చట్టానికి తూట్లుపొడిచి తెలంగాణను తీవ్ర అన్యాయానికి గురిచేసిన బీజేపీ ప్రభుత్వంపై రాష్ట్ర ఎంపీలు, మంత్రులు ఢిల్లీలో ధర్నా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి స్థాయిలో వచ్చిన మోడీ ముచ్చింతల్‌లో జరిగిన సమతా సప్తాహంలో రాజకీయాలు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు. దౌర్జన్యంగా భద్రాచలం పరీవాహక మండలాలను ఆంధ్రాలో కలిపిస కేంద్రం ఐదు ఆరు రాష్ట్రాల ఎన్నికలకోసం కొత్త అబద్దాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ముఖ్యమంత్రినే ఏకవచనంతో సంభోదించడం అవాకులు చవాకులు పేలడం అత్యంత దుర్మార్గమైందని అన్నారు. తమకు సంస్కారం ఉంది కాబట్టి వ్యక్తగత ధూషణలకు దిగడం లేదన్నారు. రైతాంగం పండించిన పంటకు గిట్టుబాటుధర ఇవ్వకపోగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అతీగతీలేదని 119 స్థానాల్లో పోటీచేసి 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్‌ను ప్రజలు మరిచిపోయారని ఎద్దేవాచేశారు. భద్రాచలం అభివృద్ధికి 100 కోట్లుతప్పక కేటాయింపు జరుగుతుందన్నారు. రాష్ట్రంలో అన్ని ఆలయాల అభివృద్ధి జరుతుందని అన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో జడ్పీ వైస్ చైర్మెన్ కోరం కనకయ్య, గ్రంధాలయ బోర్డు చైర్మెన్ దిండిగల రాజేందర్, టిఆర్ఎస్ పట్టణ అద్యక్షులు రాజుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.