Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్లో మంగళవారం నగర మేయర్ పునుకొల్లు నీరజ పర్యటించారు. డివిజన్ పరిధిలోని కిన్నెరసాని థియేటర్, ఇన్కామ్ టాక్స్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించే శానిటేషన్ డైన్, కల్వర్ట్ నిర్మాణ పనులను సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్ తో కలిసి ఆమె పరిశీలించారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా డ్రైన్ కల్వర్టు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ డోన్ వాన్ సరస్వతి రవి, నాయకులు నామవరపు సతీష్, ఈశ్వర్, ప్రసాద్, హనుమంతరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.