Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం మండలానికి చెందిన మున్నూరుకాపు విద్యాకుసుమాలు ఎంబిబిఎస్ ఉచిత సీటు సాధించారు. ఆ విద్యార్థినులు చిన్ననాటి నుండి లక్షణంగా చదువుతూ లక్ష్యం వైపు దూసుకువెళుతున్నారు. తల్లిదండ్రులు, విద్యా బుద్దులు నేర్పిన గురువుల గర్వపడేలా 2021 సెప్టెంబర్ నెలలో 12వ తేదీన జరిగిన నీట్ పరీక్షల్లో వారి మేధాశక్తికి పదును పెట్టి మంచి మార్కులతో పాటు ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మండలంలోని చిన్నబండిరేవు గ్రామానికి చెందిన కేతవరపు శ్రీనివాసరావు, శైలజ దంపతుల కుమార్తె కేతవరపు చరిత చిన్ననాటి నుండి చదువు పట్ల ఆశక్తితో మంచి ఫలితాలతో చదువులో రాణిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో జరిగిన నీట్ పరీక్షల్లో తన మేధాశక్తితో నీట్లో 531 మార్కులు సాదించడంతో పాటు ఆలిండియా స్థాయిలో 59760 ర్యాంకుతో ఎంబిబిఎస్ ఉచిత సీటుకు అర్హత సాదించింది. వెబ్ అప్షన్ల్లలో చరిత ఖమ్మం మమతకాలేజీలో సీటు సాధించింది. లకీëనగరం గ్రామానికి చెందిన పత్తివాడ జగదీష్, శ్రీదేవిలకు చెందిన రోష్మిత సైతం విద్యలో తగ్గేదేలే అన్న చందంగా హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో బైపిసి ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ విద్యను అభ్యశించి ఎంసెట్‌లో మంచి మార్కులు సాదించడంతో పాటు 2021 సెప్టెంబర్ నెలలో జరిగిన నీట్ పరీక్షల్లో 567 మార్కులతో పాటు ఆలిండియా స్థాయిలో 35461 ర్యాంకు సాదించి హైదరాబాద్ అపోలో వైద్య కళాశాలలో ఉచిత సీటుకు అర్హత సాధించింది. ఎంబిబిఎస్‌లో ఉచిత సీటుకు అర్హత సాదించిన మున్నూరుకాపు విద్యాకుసుమాలు చరిత, రోష్మితలను పలువురు అభినందించారు.