Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
పట్టణానికి చెందిన ఆర్య వైశ్య ప్రముఖులు వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు గ్రంధి నాగేశ్వరావు, మంగళవారం వారి స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. విషయం చరవాణి ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వారి మృతి పట్ల తీవ్ర సంతాపం, వారి కుమారులకు, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రైతు సమన్వయ సమితి నాయకులు లక్కినేని.రఘు, పసుమర్తి.చందర్రావు, అనుమెలు.వెంకటేశ్వరరావు, మిట్టపల్లి.సత్యనారాయణ, మోటమర్రి ప్రసాదరావు, దోసపాటి.కృష్ణార్జునరావు, రాచమల్ల.నాగేశ్వరరావు, మోటామర్రి శ్రీను, పోతురాజు. గురునాథం, వారి పార్థివదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. సంతాపం తెలిపిన వారిలో ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజరు కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, గొర్రెపాటి రాదయ్య, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, ఎఎంసి చైర్మన్ చెక్కిలాల. లక్ష్మణ్ రావు, వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు ఉన్నారు.