Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
2022-23 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో గల 8 తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో ఆరవ తరగతిలో ఇంగ్లీష్ మీడియం నందు సీబీఎస్సీ సిలబస్లో ప్రవేశం పొందుటకు గిరిజన బాలురు, బాలికలకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరడం జరుగుతుందని భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పొట్రు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశం పొందు పాఠశాలలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు, ఖమ్మం జిల్లాలో ఒకటి కలవని ఆ పాఠశాలలు గండుగాపల్లి, పాల్వంచ, గుండాల, చర్ల, టేకులపల్లి, దుమ్ముగూడెం, ములకలపల్లి సింగరేణిలో పడుతున్నాయని ఆయన అన్నారు. ఆసక్తిగల గిరిజన బాల బాలికలు https://ww.telanganaemrs ద్వారా 50 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని అట్టి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించబడునని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందు వారు కావలసిన సమాచారం కొరకు సమీపంలో ఉన్న గిరిజన ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయం నందు సంప్రదించి తెలుసుకో గలరని ఆయన పేర్కొన్నారు.