Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రఫీ
- నేడు సత్తుపల్లిలో నిరసన
నవతెలంగాణ- సత్తుపల్లి
సింగరేణి గనుల ప్రయివేటీకరణను టీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎస్కే రఫీ పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపు మేరకు బుధవారం నిరాహారదీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రఫీ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగే ఈ నిరాహారదీక్ష కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రఫీ కోరారు.