Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మాజీ మంత్రి తుమ్మల....
అ సాయుధ యోధునికి పలువురి నివాళి
నవతెలంగాణ-అశ్వారావుపేట
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, స్వతంత్ర సమరయోధులు రేగళ్ళ చెన్నారెడ్డి జీవితాంతం నిజాయితీగా జీవనం సాగించిన నిబద్దత గల కమ్యూనిస్టు నాయకుడని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైద్రాబాద్లో సోమవారం మృతి చెందిన చెన్నారెడ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం అచ్యుతాపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు చెన్నారెడ్డి మృతదేహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులు అర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శి వర్గం సభ్యులు పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, చిరంజీవి, దొడ్డా లక్ష్మినారాయణలు చెన్నారెడ్డి పార్ధివ దేహంపై పార్టీ పతాకాన్ని కప్పి జోహార్లు అర్పించారు. సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల కార్యదర్శులు భాగం హేమంత రావు, షాబీర్ పాషా నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టి.ఆర్.ఎస్ నాయకులు జారే ఆదినారాయణ, అశ్వారావుపేట, నారాయణపురం పిఎసిఎస్ అధ్యక్షులు నూతక్కి నాగేశ్వరరావు, నిర్మల పుల్లారావు, తెదేపా నాయకులు కట్రం స్వావి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. చెన్నారెడ్డి సమకాలికులు, ప్రముఖులు ఆలపాటి రాంమోహన్ రావు(రాము), కాసాని వెంకటేశ్వరరావు, సుంకవల్లి వీరభద్రరావు, జూపల్లి కోదండ వెంకట రామారావులు పాల్గొన్నారు.