Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
ఈ నెల 20వ తేదీన జరుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నా భద్రాచలం పట్టణానికి చెందిన చారు గుండ్ల శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జూలూరుపాడులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మండల నాయకులు, జిల్లా, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ భవన నిర్మాణానికి స్థలసేకరణతో పాటు, భవన నిర్మాణానికి తన వంతు రూ.ఆరు లక్షల విరాళాన్ని అందజేస్తామన్నారు. జిల్లా మహా సభ ద్వారా నిరంతరం కొనసాగే విధంగా సేవా ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పేద ఆర్యవైశ్య విద్యార్థినీ విద్యార్థులను పేద ఆర్యవైశ్యులను ఆదుకుంటామన్నారు. 20న జరిగే ఎన్నికల్లో తనను గెలిపించి జిల్లా ఆర్యవైశ్యులకు సేవచేసే భాగ్యాన్ని కల్పించాలని ఆయన కోరారు. సమావేశంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు పెండ్యాల ప్రసాదరావు, తొండపు సుబ్బారావు, కొదుమురు భాను ప్రకాష్, పట్టణాధ్యక్షుడు పూర్ణచందర్రావు, రాష్ట్ర జిల్లా కౌన్సిల్ మెంబర్లు మల్లికార్జున రావు, కృష్ణ మూర్తి, సత్యనారాయణ, కమలాకర్, రమేష్, రామ నరసింహారావు, కోటేశ్వరరావు పాల్గొన్నారు.