Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
శ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట మండల రెవెన్యూ కార్యాలయంలో లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తల్లితండ్రులు ఆడపిల్లల పెళ్ళిల్లు చేయడానికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషమన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, ఎంపీపీ సొయం ప్రసాద్, వైస్ ఎంపీపీ ధార మల్లికార్జున్ రావు, సొసైటీ చెర్మన్ రావు జోగేశ్వర రావు, మండల యువజన అధ్యక్షులు గోపి శాస్త్రి, టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు, వైస్ ప్రెసిడెంట్ ధార యుగెందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.న