Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మున్సిపల్ చైర్మెన్‌కు కలెక్టర్ ప్రశంసలు
అ జాతీయ స్థాయిలో అవార్డు రావాలని ఆకాంక్ష
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని వ్యర్థాలతో ఎరువుల తయారీ కేంద్రం ఏర్పాటు చేయడం రాష్ట్రంలో ఎక్కడా లేదని ఇల్లందు మున్సిపాలిటీ రోల్ మోడల్‌గా నిలుస్తుందని కలెక్టర్ అనుదీప్ అన్నారు. మున్సిపాలిటీలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టీ మంగళవారం పరిశీలించారు. డీఆర్సీసీ బిల్డింగ్, ఇల్లందు మున్సిపల్ హాల్, వెండర్ జోన్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే రోల్ మోడల్‌గా ఇల్లందు ఎరువుల తయారీ కేంద్రం ఉంటుందని కొనియాడారు. మున్సిపల్ చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, పాలకవర్గం చేస్తున్న కృషిని ప్రశంసించారు. అతి త్వరలో జాతీయ స్థాయిలో ఇల్లందు మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్లో అవార్డు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న వనరులను సక్రమంగా వినియోగించుకుంటున్నారని చైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాలకవర్గాన్ని అధికారులని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల భాగస్వామ్యంతోనే పట్టణాలు పరిశుభ్రంగా ఉంటాయని తెలిపారు. అనంతరం మున్సిపల్ సమావేశ మందిరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణవేణి, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ అంజన్ కుమార్, తహసీల్దార్ కృష్ణవేణి, మేనేజర్ అంకుష్ షావలి, అకౌంటెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ శంకర్, మున్సిపల్ కౌన్సిలర్లు కొక్కు నాగేశ్వరరావు, సయ్యద్ ఆజామ్, నవీన్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.