Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ప్రభాకర్‌రావు
నవతెలంగాణ-మణుగూరు
కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు నేడు ధీక్ష నిర్వహిస్తున్నారని టిబిజికేఎస్ ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర్‌రావు అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేడు ఉదయం 8 గంటలకు అన్ని గనులు, డిపార్టుమెంట్ల టిబిజికేఎస్ ఫిట్ సెక్రటరీలు, సభ్యులు, సేఫ్టి కమిటీ సభ్యులు టీబిజికేఎస్ కార్యాలయానికి చేరుకోవాలని కోరారు.