Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిర్బంధం ఆపకుంటే ప్రతిఘటన తప్పదు
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా
నవతెలంగాణ-అశ్వాపురం
పోడు సాగుదారులపై ఫారెస్టు అధికారుల నిర్భంధం ఆపాలని, నిర్భంధం ఆపకుంటే ప్రతిఘటన తప్పదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పార్టీ మండల కమిటీ సమావేశం గద్దల శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మచ్చా పాల్గొని మాట్లాడారు. అనాదిగా గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇస్తాం..దరఖాస్తులు చేసుకోమని ఇప్పుడు వాటి సంగతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులను భూములపైకి పంపి గిరిజనులను భయభ్రాంతలకు గురి చేస్తుందన్నారు. ప్రభత్వ ద్వంద వైఖరి విడనాడాలని అన్నారు. ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాంతో దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. భూముల చుట్టూ ట్రెంచ్‌లు తవ్వుతూ గిరిజనులను భయభ్రాతులకు గురిచేస్తున్నారని అన్నారు. వలస ఆదివాసీ గ్రామాల్లో నివాసం ఉంటున్న ఆదివాసులకు నోటీసులు ఇచ్చి వారంలో ఆధారాలు చూపించకుంటే భూములు స్వాధీనం చేసుకుంటామని, లేదంటే కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీ గిరిజనుల సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని చట్టంలో వున్నా ప్రభుత్వం పట్టాలు ఇవ్వకుండా ఇప్పుడు ఫారెస్ట్ అధికారులను రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఫారెస్ట్ అధికారులు సమన్వంతో వ్యవహరించాలని కోరారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి పాయం నరసింహ రావు, నాయకులు బీరం శ్రీను, సాంబశివ రావు, పద్మ, సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.