Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపులో భాగంగా నేడు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు జరుగు ధర్నాను జయప్రదం చేయాలని కాంట్రాక్టు కార్మికులకు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలిపారు. జీతభత్యాల పై చట్టబద్ధ హక్కులు సౌకర్యాలపై ఈ నెల 12 నుండి జరుగు నిరవధిక సమ్మెలో భాగంగా నేడు సింగరేణి ప్రధాన కార్యాలయం ముందు జరుగు ధర్నాకు సింగరేణి వివిధ విభాగాల్లో పని చేస్తున్నా కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు డి.ప్రసాద్ కోరారు. టేకులపల్లిలో జరిగిన సమావేశంలో తాను మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు తమ హక్కులు సౌకర్యాల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, జిల్లా ఉపాధ్యక్షులు నెమల్ల సంజీవ్, మధుసూదన్ రెడ్డి, రమేష్, సతీష్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.