Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో టీఎన్టీయూసీ విజయం స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర టీడీపీకి ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, జాతీయ అధికార ప్రతినిధి జోత్స్నా తిరునగరి పేర్కొన్నారు. మంగళవారం సారపాకలో టీఎన్టీయూసీ గుర్తింపు కార్మిక సంఘాన్ని ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె టీఎన్డీయూసీ గుర్తింపు కార్మిక సంఘ సభ్యులను ప్రత్యేకంగా అభినందించి, మాట్లాడారు. ఈ విజయం యావత్ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి, కార్మిక విభాగానికి స్ఫూర్తిదాయకమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో టియన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోటు రంగారావు, ఐటీసీ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్, చైర్మన్ గల్లా నాగ భూషయ్య, సెక్రెటరీ జనరల్ జీవన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, ఈశ్వర్ రెడ్డి, నాగేశ్వర రావు, బివి.సుబ్బారావు, కరణం శ్రీనివాస రావు, శ్రీహరి, మండల టీడీపీ నాయకులు తాళ్లూరి జగదీశ్వర రావు, వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.