Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫారెస్ట్ అధికారులను ఆదేశించిన విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
పోడు భూముల సాగుదారుల జోలికి వెళ్ళొద్దని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఫారెస్ట్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక నియోజకవర్గ స్థాయి ఫారెస్ట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడుతూ కందకాలు తవ్వకూడదని అధికారులకు సూచించారు. పోడు సాగుదారులకు ఏదైనా జరిగితే ఫారెస్ట్ అధికారులదే బాధ్యత అన్నారు. పోడు భూముల విషయంలో సీఏం కేసిఆర్ నేతృత్వంలో ప్రతి ఒక్కరికీ పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గస్థాయి ఫారెస్ట్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.