Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో
బిల్లు పెట్టాలి
అ అఖిలపక్షం ఆధ్వర్యంలో
రిలే నిరాహార దీక్షలు
నవతెలంగాణ-భద్రాచలం
ఐదు పంచాయతీల సాధన కోసం రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజు మంగళవారం అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ నిరాహారదీక్షలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ జిల్లా నాయకులు ముత్యాల విశ్వనాథంలు ప్రారంభించారు. తొలుత దీక్షలో కూర్చున్న సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు బుడగం శ్రీనివాస్, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరపు వెంకట రెడ్డిలకు పూల మాల వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలంను రాజకీయాలకు వాడుకుంటున్నారే తప్ప అభివృద్ధి చేయడానికి చేతులు రావడం లేదని విమర్శించారు. భద్రాచలం రక్షణకు అఖిలపక్ష పార్టీలుగా ఏర్పడి కొనసాగిస్తున్న ఉద్యమం విజయ వంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం సీపీఐ జిల్లా నాయకుడు ముత్యాల విశ్వనాథం మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా వున్న భద్రాద్రిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ న్యాయం చేసే విధంగా ఆలోచన చేయాలని ఆయన అన్నారు. ఈ దీక్షలో కూర్చున్న వారిలో సీపీఐ(ఎం) నాయకులు నకిరగంటి నాగరాజు, కోరాడ శ్రీనివాస రావు, డి.రామకృష్ణ, రాంబాబు, సీపీఐ నాయకులు తమ్ముళ్ల వెంకటేశ్వరరావు, మందపాటి సుధాకర్ రెడ్డి, కుంజా శ్రీనివాసరావు, రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్, తాండ్ర నరసింహారావు, బలుసు నాగ సతీష్, సుధీర్ కుమార్, ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్, కార్యదర్శివర్గ సభ్యులు కె.బ్రహ్మచారి, జిల్లా కమిటీ సభ్యులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు అప్పారావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగా, కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వి.రామారావు, నాదెళ్ల లీలావతి, డి.లక్ష్మి, యు.జ్యోతి, సిపిఐ పట్టణ నాయకులు బి.సాయి, నరసింహ, భాస్కరరావు, సీతారాములు, విశ్వనాథం, ఇమామ్ ఖాసీం, ఖాధర్, గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతిరాల రవికుమార్, బొలిశెట్టి రంగారావు, రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రామ్మోహన్రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వసంతాలు రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.