Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జానంపేట కేంద్రంగా 100 ఎకరాల్లో పీజీ కళాశాల,
పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తాం
అ రూ.2 కోట్లతో డిగ్రీ కళాశాలను అభివృద్ధి చేస్తాం
అ ప్రభుత్వ విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే పేద విద్యార్దులకు ఇంగ్లీషు విద్య ఎంతో అవసరమని, వైద్య, విద్యా రంగానికి రూ.7 వేల 780 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. మంగళవారం స్థానిక జూనియర్ డిగ్రీ కళాశాలలో డీఎంఎఫ్ నిధులు రూ.2 కోట్లతో అదనపు తరగతి గదుల భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డిగ్రీ కళాశాల అభివృద్ధికి మరో రూ.2 కోట్లు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు విద్యా, వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. ఏడు జిల్లాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కోక్క మెడికల్ కళాశాల రూ.వేయ్యి కోట్లతో నిర్మించబడతాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకి మరో 1,000 బెడ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. జానంపేట కేంద్రంగా 10 ఎకరాల్లో ఉపాధి కల్పించే కోర్సులకు ప్రాధాన్యత ఇస్తూ పి.జీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు మేధావులు, ప్రోఫెసర్ల సలహాలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జోన్ల విధానాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వ విడుదల చేసిన 317 జీఓ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రయోజనం చేకూర్చుతుందని, ఎలాంటి ఆందోళన చేందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వ 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.శ్రీనివాస్, జడ్పీటీసీ నరసింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, సమితిసింగారం సర్పంచ్ బచ్చల భారతి, ఎంపీటీసీలు రమ్య, కోటేశ్వరరావు, మండల, పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, ముత్యంబాబు, కార్యదర్శులు రామిడి రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.