Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వైద్యులు గైర్హాజరవడంతో కలెక్టర్ ఆగ్రహం
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల కేంద్రమైన బూర్గంపాడులోని ప్రభుత్వ ఆసుపత్రి (సీహెచ్సీ)ని కలెక్టర్ అనుదీప్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ తనిఖీ సమయంలో ఆసుపత్రిలో ఉండాల్సి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ఆవరణను, రికార్డులు పరిశీలించిన కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆసుపత్రిలో వైద్యుల పనితీరుపై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సందర్శించిన సిబ్బంది తీరులో మార్పు లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో సాక్షాత్తు కలెక్టర్ ఆసుపత్రిని తనీఖీ చేసిన పనితీరు మార్చుకోవాలని హెచ్చరించినా వైద్యాధికారుల్లో మార్పు రాలేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఇదే ఆసుపత్రికి కలెక్టర్ వచ్చిన సమయంలో అందుబాటులో లేని వైద్యురాలికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. అయినా సదరు వైద్యాధికారి తీరు మారకపోవడం గమనార్హం. విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భగవాన్ రెడ్డి, సర్పంచు సిరిపురపు స్వప్న, ఆర్ఎస్ఐ ఆక్చర్ పాల్గొన్నారు.