Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్
కార్యాలయం ప్రారంభం
నవతెలంగాణ-గాంధీచౌక్
కేంద్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు చట్టాన్ని రద్దు చేసిందని తిరిగి ఆ చట్టాన్ని పునరుద్ధరించే వరకు రైతాంగ పోరాట స్ఫూర్తితో కార్మిక లోకం పోరాటాలు చేయాలని సీఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం సాయిబాబు పిలుపునిచ్చారు. బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కార్యాలయాన్ని పట్టణంలో గురువారం ప్రారంభించారు. తదనంతరం దోనోజు లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన సభలో సాయిబాబు మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు పది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నాకరం కోటంరాజు, బిల్డింగ్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, సీఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరావు, తుమ్మ విష్ణువర్ధన్, సిఐటియు జిల్లా నాయకులు యర్రా శ్రీకాంత్ , టి.లింగయ్య , ఏటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.