Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజా సమస్యలపై పోరాటాలు
అ కొత్తగూడెం నియోజకవర్గ క్యాంపు కార్యాలయం
ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజా శ్రేయస్సు కోరుతూ, ప్రజలతో మమేకమై, తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం చుంచుపల్లి మండలం, విద్యానగర్లో కొత్తగూడెం నియోజకవర్గ క్యాంపు కార్యాలయం ప్రారంభిచారు. ఈ సందర్భంగా పొట్ల నాగేశ్వరరావు మాట్లాడారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున తెరాస ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలుపై ఎప్పటికప్పుడు ప్రభుతాన్ని ప్రశ్నిస్తూ, ప్రజా శ్రేయస్సు కోరుతూ ప్రజలతో మమేకమై తెరాస ప్రభుత్వంపై పోరాట కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జెబి.శౌరీ, రాష్ట్ర ఎస్టీసెల్ కన్వీనర్ మాలోత్ రాందాస్ నాయక్, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మోతుకూరి ధర్మారావు, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏనుగుల అర్జున్ రావు, కొడాలి రత్నాకర్, సామినేని నారాయణరావు, చల్లగుండ్ల వెంకటేశ్వర్లు, పరుచూరి కృష్ణమోహన్, 29వ వార్డు కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజశేఖర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీరాపురం లక్ష్మణ్, కోటేష్ నాయక్, కోటి, మహేష్, మురళి, అభి, సాగర్, వెల్లంకి వెంకటేశ్వర రావు తదితరులు నాయకులు పాల్గొన్నారు.