Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
పేద ప్రజలు జీవన పోరాటంలో పోడు భూమి కోసం అండగా పేద గిరిజన గిరిజనేతర పోడు సాగుదారులుకు అండగా వుండాలని మండల పరిధిలోని జానకీపురం రంగాపురం గ్రామ పోడు సాగుధారులు లింగనబోయిన వెంకన్న ఆధ్వర్యంలో ఆశ్వరావుపేట శాసన సభ్యులు మెచ్చా నాగేశ్వరావుకి తన నివాస గృహం దగ్గరకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చారు. ఎనో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములును ఫారెస్ట్ అధికారులు యంత్రాలతో దున్నడానికి సిద్ధపడుతున్నారని మాకు అండగా మీరు వుండాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, రాంబాబు, సుధాకర్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.