Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరుగురు అరెస్ట్
అ ఆటో, ద్విచక్ర వాహనం సీజ్
అ ఇన్చార్జ్ ఏఎస్పీ రోహిత్ రాజ్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని అటవీ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా నిషేధిత 20 కేజీల గంజాయిని గురువారం పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఆరుగురుని అరెస్ట్ చేశారు. వారి ద్విచక్ర వాహనాలైన ఆటో, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను భద్రాచలం ఇన్చాÛర్జి ఏయస్పీ బి.రోహిత్ రాజ్ వెల్లడించారు. భద్రాచలంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పట్టణ సీఐ టి.స్వామి ఆధ్వర్యంలో ఎస్సై మధు సిబ్బందితో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఏపీ 20 టీఏ 7721 నెంబర్ గల ఆటోలో నలుగురు వ్యక్తులు, ఏపీ 16 ఏఈ 1633 గల మోటార్ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు అనుమా నా స్పదంగా కనిపించారు. ఈ వాహనాలను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ఈ వాహనాల్లో ప్రభుత్వ నిషే దిత గంజాయి 20 కేజీలు ఉండటాన్ని పోలీసులు గమనించి స్వాధీనపరుచుకున్నారు. మరిపెడ బం గ్లాకు చెందిన బాదావత్ కృష్ణ, సారపాక గ్రామానికి చెందిన బాణోత్ తరుణ్, నారగొని సాయి యాదవ్, నునావత్ రాజు, చల్ల ఉపేంద్ర, గోల్లోరి సురేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల గడ్డ నుంచి మహారాష్ట్ర జాల్నాకు ఈ గంజాయిని తరలి స్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పట్టుబడిన గంజాయి విలువ రూ.4 లక్షల విలువ ఉంటుందని ఏయస్పీ పేర్కొన్నారు. గతంలో బాదావత్ కృష్ణ, బాణోత్ తరుణ్‌లు గంజాయి రవాణా చేసిన కేసులు వున్నాయి. ఈ సందర్భంగా ఏఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని ఆయన అన్నారు. నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరే యితర వస్తువులను తరలించినా వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ టి.స్వామి, యస్ఐ మధు, సిబ్బంది పాల్గొన్నారు.