Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కార్యకర్తల్ని బిడ్డల్లా కాపాడుకున్న కామ్రేడ్ భారతి
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే.రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
అమరజీవి కామ్రేడ్ పర్సా సత్యనారాయణ సతీమణి కామ్రేడ్ భారతి మృతికి సీపీఐ(ఎం) కొత్తగూడెం పట్టణ కమిటీ సంతాపాన్ని వ్యక్తం చేసింది. గురువారం స్థానిక మంచికంటి భవన్లో ఏర్పాటు చేసిన సంతాప సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే.రమేష్ మాట్లాడుతూ పర్సా సత్యనారాయణ కార్మిక ఉద్యమంలో పని చేయడానికి భారతి ఎంతో తోడ్పాటును అందించారని తెలిపారు. కమ్యూనిస్టు కార్యకర్తలని ఆమె సొంత బిడ్డల్లా చూసుకున్నారని కొనియాడారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటూ మహిళా ఉద్యమంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. భారతి మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని కోనియాడారు. పరస దంపతుల ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి, సిపిఎం కొత్తగూడెం పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, పట్టణ కమిటీ సభ్యులు సందకూరి లక్ష్మి, జునుమాల నగేష్, డి.వీరన్న, సమ్మయ్య, రాజారావు, ప్రమోద్, వీరబాబు, యూటీయఫ్ నాయకులు కృష్ణ, బి.రాజు తదితరులు పాల్గొన్నారు.