Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అమరవీరుల స్తూపం వద్ద నిరసన
నవతెలంగాణ-భద్రాచలం
ఆంధ్రలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బంద్ కార్యక్రమంలో భాగంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అదేవిధంగా సీపీఐ(ఎం) అమరవీరుల స్తూపం వద్ద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్‌లు మాట్లాడుతూ తెలంగాణలో ఆ ఐదు గ్రామపంచాయతీలు కలపటం వల్ల భద్రాద్రి అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఐదు గ్రామపంచాయతీలు తెలంగాణ కలపాల న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బీ.నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.రేణుక, సున్నం గంగ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, బి.వెంకట రెడ్డి, వై.వెంకటరామారావు, నాదెళ్ళ లీలా వతి, పి.సంతోష్ కుమార్, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, యు.జ్యోతి, యన్.నాగరాజు, రత్నం లక్ష్మణ, అన్వేష్, మందా రమణయ్య, మాదవరావు తదితరులు పాల్గొన్నారు.