Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండలంలో తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు విస్తృతంగా పర్యటించారు. ముందుగా టి.కొత్తగూడెం గ్రామంలో పర్యటించి ఇటీవల మరణించిన సర్పంచ్ కణితి చిన్నక్క కుటుంబాన్ని పరామర్శించానారు. అనంతరం ఏడేళ్ల బయ్యారం గల పార్టీ కార్యాలయంలో పినపాకకు చెందిన శంకా రాము అనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మృతి చెందటంతో అతని తల్లి శంకా రామక్క కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ తరుఫున మంజూరైన రూ.2 లక్షల చెక్కును ఎమ్మెల్యే రేగా కాంతారావు పంపిణీ చేశారు. వీటితో పాటు పలు శుభకార్యాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.