Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ త్రైపాక్షిక ఒప్పందాలు అమలు చేయకుంటే
మరో ఉద్యమం తప్పదు
అ ప్రభుత్వ వేతన జీవో 60 అమలుకు
సింగరేణి యాజమాన్యం అంగీకారం
అ విలేకర్ల సమావేశంలో
సింగరేణి కార్మిక సంఘాల జేఏసి నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమ్మె నోటీసుపై ఆర్ఎల్సి సమక్షంలో జరిగిన చర్చలు, ఒప్పందాలను సింగరేణి యాజమాన్యం అమలు చేయకుంటే మరో ఉద్యమం తప్పదని సింగరేణి కార్మిక సంఘాల జేఏసి నాయకులు హెచ్చరించారు. ఏఐటియుసి జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో గురువారం జరిగిన జేఏసి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఏఐటియుసి నాయకులు గుత్తుల సత్యనారాయణ, సిఐటియు నాయకులు ఎర్రగాని కృష్ణయ్య, ఇఫ్టూ నాయకులు యాకూబాషావలి మాట్లాడారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన దశలవారి ఆందోళనా కార్యక్రమాలు ఫలితాన్నిచ్చాయని, కార్మిక సంఘాల జేఏసి ఇచ్చిన సమ్మె నోటీసుపై జరిగిన చర్చలు ఫలించాయని నాయకులు తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 60 ప్రకారం ప్రస్తుతం ఉన్న వేతనాలపై 30శాతం పెంచి చెల్లించేందుకు, మరో వేతన జీవో 22పై గెజిట్ రూపొందించిన ఆ జీవోను అమలు చేసేందుకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. కరోనాతో మృతిచెందిన కాంట్రాక్టు కార్మికులకు రూ.15 లక్షల పరిహారం, ప్రమాదంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు బ్యాంకు భీమా రూ.20లక్షలతోపాటు కోల్ ఇండియా ఉత్తర్వుల మేరకు రూ.15లక్షల పరిహారం చెల్లిం చే విధంగా ఒప్పందం జరిగినట్లు తెలిపారు. ప్రతీఏటా చెల్లించే బోనస్ 8.33 పెంచి చెల్లించేందుకు, జాతీయ సెల వు దినాలు అమలు చేసేందుకు, 7వ తేదీలోపు వేతనాల చె ల్లింపు, సిఎంపిఎఫ్, వైద్య సౌకర్యం అమలు చేసేందుకు ఒ ప్పందం జరిగిందని తెలిపారు. మిగిలిన సమ్మె నోటీసు డి మాండ్ల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు, కాంట్రా క్టు కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగిందని, అన్ని ఒప్పందా లు రాతపూర్వకంగా యాజమాన్యం కార్మిక సంఘాల ప్రతినిధులకు అందజేసినట్లు తెలిపారు. ప్రధానమైన డిమాండ్లు పరిష్కారం అయినందున 12 నుంచి జరపత లపెట్టిన నిరవధిక సమ్మెను వాయిదా వేస్తున్నట్లు నాయ కులు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలో ఏఐటియుసి నాయకులు పిట్టల రాంచందర్, సిఐటియు నాయకులు చంద్రశేఖర్, ఇఫ్టూ నాయకులు డి.ప్రసాద్, పి.సతీష్, మల్లిఖార్జున్ రావు, ఐఎన్టీయూసీ నాయకులు నాగ భూషణం, హెచ్ఎంఎస్ నాయకులు పాల్గొన్నారు.