Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐదు పంచాయతీలు తక్షణమే తెలంగాణలో కలపాలి
అ టీఎన్జీవోస్ నాయకులు నర్సింహారావు, బాలకృష్ణ
నవతెలంగాణ-భద్రాచలం
ఐదు గ్రామ పంచాయతీల సాధనకు జరుగుతున్న నిరాహారదీక్షను 8వ రోజైనా గురువారం భద్రాచలం ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బాధ్యులు పలివెల రవికుమార్, శ్రీధర్ రెడ్డి, సాని కొమ్ము బ్రహ్మారెడ్డి, ముని కేశవ్, అబ్రహం, కిషోర్ సురేష్, తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ పుల్లారావు, మూర్తి, మహమ్మద్ హుస్సేన్, తదితరులు ప్రారంభించారు. అదేవిధంగా టీఎన్జీవోస్ నాయకులు డెక్కా నరసింహారావు, బాలకృష్ణలు మాట్లాడుతూ భద్రాచలం అభివృద్ధి కోసం జరిగే ఉద్యమాలకు మేముకూడా భాగస్వామి అవుతామని పేర్కొన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో ఐదు పంచాయతీల బిల్లు ప్రవేశపెట్టి భద్రాచలంకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.