Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
పోరాటాల ద్వారానే పోడు భూములు దక్కుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అఖిల పక్ష, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గుండాల, ఇల్లందు, టేకులపల్లి, కంబాలపల్లి, కొత్తగూడెం పోడు యాత్రలో భాగంగా గురువారం మండల కేంద్రంలోని ఏపీఆర్ సెంటర్ నుండి గుండాల సంత ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా అధ్యక్షతన జరిగిన పోడు పోరాట యాత్ర సభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి పోటు రంగారావు, రాష్ట్ర నాయకులు అవునూరి మధు, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, సీపీఐ(ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి బొమ్మకంటి కొమరయ్య, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టీడీపీ, కాంగ్రెస్, తుడుందెబ్బ, ఏజెన్సీ దళిత హక్కుల పోరాట సమితి, నేతకాని సంఘాల నాయకులు మాట్లాడారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి దరఖాస్తులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఫారెస్ట్ అధికారులను ఉసిగొలిపి దాడులు చేయించడం ఏంటని ప్రశ్నించారు. పోడు రైతుల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాట తప్పిందని, అసలు ప్రభుత్వం అంటేనే గ్రామ సభలు, గ్రామ సభల ద్వారా తీర్మానం చేసి పట్టాలిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు సంబంధించి ఎలాంటి సర్వేలు చేయకుండానే భూములు లాక్కునేందుకు దాడులకు పాల్పడడం సిగ్గుసేటన్నారు. దశాబ్దాల కాలంగా పోడునే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ, ఇతర పేదల భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం, ఫారెస్టు శాఖ కుట్రలు చేస్తుందన్నారు. జైలుకైనా వెళ్తాం కానీ భూములు మాత్రం వదల మని పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్లు తప్ప అని తేల్సి చెప్పారు. పట్టాల కోసం దరఖా స్తులు చేసుకున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి పోడు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కందకాలు తవ్వడం ఆపాల న్నారు. పోడు దరఖాస్తులు పరిశీలించి సాగులో ఉన్న భూ ములన్నింటికీ పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ మహబూబా బాద్ పార్ల మెంట్ నియోజ కవర్గ వర్గ ప్రధాన కార్యదర్శి, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, నాయకురాలు సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఈసం పాపారావు, గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, జడ్పీటీసీ రామక్క, సర్పంచ్ సీతరాములు, తుడుందెబ్బ జిల్లా నాయకులు పూనెం శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కొడెం వెంకటేశ్వర్లు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులు పొంబొయిన చంద్రయ్య, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, గుండాల సబ్ డివిజన్ కార్యదర్శి ఈసం శంకర్, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, చండ్ర అరుణ, ఏజెన్సీ దళిత హక్కుల పోరాట సమితి జాతీయ కన్వీనర్ బొమ్మెర శ్రీనివాస్, లక్ష్మిదేవిపల్లి జడ్పీటీసీ నేరెడ్డి వసంత, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామవత్ శ్రీరామ్, వ్యకాస నాయకులు వెంకటరాములు, సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి భుక్యా వీరభద్రం, వ్యకాస జిల్లా అధ్యక్షులు జాటోత్ క్రిష్ణ, ఆదివాసీ, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుగ్గి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.