Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో వినూత్న నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
దక్షణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం ప్రాంత అస్తిత్వాన్ని కాపాడే భాద్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, అభివృద్ధికి ఆటంకంగా మారిన విభజనపై కేంద్రం ప్రభుత్వం స్పందించాలని ప్రతిపక్ష పార్టీల జేఏసి నాయకులు కోరారు. ఆంధ్రలో విలీనం చేసిన కన్నాయిగూడెం, ఎటపాక, పిచ్చుకలపాడు, పురుషోత్తమపట్నం, గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రామాటాకీస్ రోడ్డులో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అర్ధనగంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో కొనసాగాల్సిన ఐదు పంచాయతీలను విడదీసి తీరని అన్యాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుత్తుల సత్యనారాయణ, సిపిఐ, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శులు వై.శ్రీనివాసరెడ్డి, లిక్కి బాలరాజు, న్యూడెమోక్రసి పార్టీల నాయకులు పి.సతీష్, సురేందర్, సిపిఐ, సిపీఐ(ఎం) నాయకులు ఎస్.లక్ష్మి, ఎస్కె.ఫహీమ్, జునుముల నగేష్, పిట్టల రాంచందర్, డి.వీరన్న తదితరులు పాల్గొన్నారు.