Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పీసా గ్రామ సభలో ఎంపీపీ తీర్మాణం
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పోడు భూముల్లో కందకాలు తవ్వకూడదని మండల కేంద్రంలో అత్యవసర పీసా గ్రామ సభ పంచాయతీ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ పీసా గ్రామసభకు స్థానిక సర్పంచ్ గైర్హాజరైన నేపథ్యంలో ఆళ్ళపల్లి పీసా ఉపాధ్యక్షుడు, కార్యదర్శులు అరెం సుమన్, ఈసం సాంబశివరావు, రాయిగుడెం పీసా ఉపాధ్యక్షుడు బట్టు సురేష్, ఆర్వోఎఫ్ఆర్ కమిటీల అధ్యక్షతన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సభలో పీసా కమిటీ, ఆర్వోఎఫ్ఆర్ కమిటీ ఆమోదంతో పోడు భూములలో కందకాలు తవ్వకూడదు తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసేంతవరకు ట్రెంచులు తీయవద్దని తీర్మానించినట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, రాయిగూడెం, మైలారం ఆర్వోఎఫ్ఆర్ కమిటీ సభ్యులు పూనెం రామచంద్రు , గొగ్గెల నరేష్, జోగ వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.