Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు : అఖిలపక్షం
నవతెలంగాణ-చర్ల
భద్రాచలంను ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలను తెలంగాణలో కలపాలని మండల వ్యాప్తంగా చేపట్టిన బంద్ సంపూర్ణమైంది. సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఆంధ్రలో కలిపిన కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, ఎటపాక పురుషోత్తపట్నం, గుండాల ఈ 5 గ్రామపంచాయతీలు తెలంగాణలో కలపాలని గురువారం బంద్కు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పాండురంగాపురం నుండి రైల్వే లైన్ భద్రాచలం వరకు పొడిగించాలని అనేక దశాబ్దకాలంలో ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఆ సమస్య నేటికీ నెరవేరలేదని అలాగే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పార్లమెంట్లో బిల్లు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. తొలుత చర్ల మండలంలో సుబ్బంపేట నుండి పర్ణశాల వరకు అఖిలపక్ష నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. భద్రాచలం నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్నటువంటి బంధుకి ఉద్యోగస్తులు వ్యాపారవర్గాలు చిరు వ్యాపారులు కార్మికులు అందరూ ఈ బందులో పాల్గొని జయప్రదం చేసిన వారందరికీ అఖిలపక్షం నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్ పార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీపీఐ(ఎం0 మండల కార్యదర్శి కొండా చరణ్, సీపీఐ మండల కార్యదర్శి అడ్డ గర్ల తాతాజీ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి, సాయి చరణ్, మచ్చారామారావు, యాలం రమేష్, అలవాల బాలు, కొంగూరు రాము, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.