Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
టీఎన్జీవోస్ మెడికల్ అండ్ హెల్త్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఫోరమ్ ఎన్నిక శుక్రవారం ఏకగ్రీవం అయింది. ఈ ఎన్నికకు ఎన్నికల అధికారిగా సుంచు వీర నారాయణ వ్యవహరిం చారు. ఈ ఎన్నికలలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్ అఫ్జల్ హసన్, ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు.
మెడికల్ అండ్ హెల్త్ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ఫోరమ్ నూతన కార్యవర్గం
అధ్యక్షులుగా పిరంగి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా ఎస్డీ హాబీబ్, అసోసియేట్ప్రెసిడెంట్గా బి.శ్యామల, వైస్ ప్రెసిడెంట్ 1గా ఎ.వీరయ్య, వైస్ ప్రెసిడెంట్ 2గా ఎన్.ఉపేందర్, వైస్ ప్రెసిడెంట్ 3గా షేక్.సఫియా బేగం, జాయింట్ సెక్రెటరీ 1గా డియం. నిర్మల, జాయింట్ సెక్రెటరీ 2గా యం.చంద్ర శేఖర్, జాయింట్ సెక్రెటరీ 3గా కె.సువర్ణ లత, ట్రెజరర్‌గా కె.శ్రీనివాసరావు, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎస్డీ.రహీం, పబ్లిసిటీ సెక్రెటరీగా ఎ.శ్యామల, స్పోర్ట్స్ , కల్చరల్ సెక్రెటరీ గా యం.రమేష్, ఈసీ మెంబర్ 1గా బి.ప్రసన్న, ఈసీ మెంబర్ 2గా ఆర్.రాజేష్, ఈసీ మెంబర్ 3గా కె.బేబీ లావణ్య, ఈసీ మెంబర్ 4గా షేక్.ఖాసీం, ఈసీ మెంబర్ 5గా కె.సునితలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అఫ్జల్ హసన్ నియామక పత్రాలను అందజేసి, శాలువా కప్పి సత్కరించారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్ అఫ్జల్ హాసన్, ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్.సాగర్లకు ఉద్యోగులు పుష్ప గుచ్ఛం అందజేసి, శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ వైస్ ప్రెసిడెంట్ నందగిరి శ్రీను, ,కోశాధికారి భాగం పవన్, టౌన్ అధ్యక్షులు సామినేని రఘు, కార్యదర్శి ఎండీ. మజీద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శాబాస్ జ్యోతి, ఇ.స్వప్న పాల్గొన్నారు.