Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైరా : వైరా మండలం వల్లాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతివనం పార్క్‌ను వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం పిరమిడ్ ధ్యాన మందిరాన్ని పత్రీజీ గురువు తో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్క్ స్థల దాత తుమ్మల గాంధీ మరియు పిరమిడ్ దాత కొమ్మినేని సావిత్రమ్మ, మరొక దాత తుమ్మల కౌసల్యమ్మ, జి.యాకోబు, వేల్పుల మురళిని సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొర్రె ముచ్చు శారమ్మ, ఉప సర్పంచ్ కళ్యాణి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్‌రావు, పిరమిడ్ ధ్యానం నిర్వాహకులు మన్యం కష్ణ, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.