Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
తాళ్లూరు వెంకటా పురం గ్రామంలోని బీసీ కాలనీలో శుక్రవారం ఆ గ్రామ సర్పంచ్ మోదుగు సుబ్బారావు, ఎంపీటీసి మర్శకట్ల మేరమ్మ సీసీ రోడ్డు పనులకు శంకుస్థాప న చేశారు. ఈజిఎస్ ఎన్ఆర్ఐ నిధులు రూ.10 లక్షలు మంజూర య్యాయని సర్పంచ్ సుబ్బారావు తెలిపారు. స్థానిక శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య చొరవతో కల్లూరు జడ్పిటీసి కట్టా అజరు కుమార్ సహాయ సహకారాలతో నిధులు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో పోచవరం సొసైటీ అధ్యక్షులు నర్వనేని పెద్ద అంజయ్య, గ్రామ టిఆర్ఎస్ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.