Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కర్ణాటక రాష్ట్రంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాల
దౌర్జన్యం నశించాలి
అ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-ఖమ్మం
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీ పీజీ కళాశాల దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను మతం పేరుతో విద్యార్థుల మధ్యన కులం పేరుతో ఘర్షణలు రేపుతున్నారన్నారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 అధికరణ ప్రకారం మతం వ్యక్తిగత అంశంగా ఉంటుందని, అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని తెలిపారు.కళాశాల విద్యార్థుల మెదళ్ళల్లో మత విద్వేషాన్ని నింపేందుకు బిజెపి, ఆర్ఎస్ఎస్ కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారన్నారు. వివిధ యూనివర్సిటీలలో రాష్ట్రాలలో విద్యాలయాల్లో మత ఘర్షణలు రేపుతున్న బీజేపీకి విద్యార్థులు, ప్రజలు, మేధావులు సరైన గుణపాఠం చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్, కళాశాల కార్యదర్శి వినోద్, స్రవంతి, నాగలక్ష్మి, మోహన్, నవీన్ తదితర విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు