Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కరోనాతో రక్షక్ బీమా కుంభకోణం నిగ్గు తేల్చాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరావు డిమాండ్ చేశారు. శుక్రవారం కారేపల్లిలో విలేకర్లతో మాట్లాడుతూ కారేపల్లి మండలం మేకలతండా, దుబ్బతండ, గంగారంతండా, గేటుకారేపల్లి, కామేపల్లి మండలం లింగాల ప్రాంతాలలో అమాయక గిరిజనుల పేరుతో కరోనా రక్షక్ భీమ క్లెయిమ్ సొమ్ములు కొందరు దళారులు కాజేశారని దానిపై పోలీసులు ప్రభుత్వ అధికారులు విచారణ చేయాలన్నారు. కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందిన నిజమైన లబ్ధిదారుల బీమా సొమ్మును కూడా దళారులు కాజేశారని తెలిపారు. మూడు నెలలుగా కుంభకోణం నడుస్తున్న ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం విచారకరమన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూలి పనులకు వలస వచ్చిన వారి పేరుతో కూడా రాని కరోనా వచ్చినట్లు బీమా సొమ్ము దళారులు కాజేశారని తమ దృష్టికి వచ్చిందన్నారు. మండలంలో ముత్యాలగూడెం, కొమ్ముగూడెం గ్రామాల్లో గిరిజనులు కరోనాతో మృతి చెందారని, అలాంటివారికి బీమా సౌకర్యం గురించి అధికారులు తెలిసేలా చేయకపోవటం విచారకరమన్నారు. కరోనా పాజిటివ్ దొంగ సర్టిఫికెట్లు సృష్టించిన దళారులు, వైద్య సిబ్బందితోపాటు ఇన్సూరెన్స్ కంపెనీ వారిని కూడా విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కె.నరేంద్ర, ఉసిరికాయలపల్లి సర్పంచ్ భానోత్ బన్సీలాల్, నాయకులు వజ్జా రామారావు, తలారి దేవప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.