Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- కల్లూరు
స్థానిక ప్రభుత్వాసుపత్రికి నూతన భవనాలు నిర్మించి అన్ని సౌకర్యాలతో 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తామని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య అన్నారు. స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో శుక్రవారం కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. 113 మంది లబ్ధిదారులకు రూ.1.13 కోట్ల విలువగల చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్లూరు ప్రభుత్వాస్పత్రిని 30 పడకలకు పెంచుతూ వైద్య విధానపరిషత్ ఆధీనంలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరిందని, త్వరలోనే నూతన భవనం అన్ని సౌకర్యాలతో నిర్మించి అన్ని రంగాలకు సంబంధించి వైద్య సేవలు అందించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బీరవల్లి రఘు, ఆర్డీవో సీహెచ్ సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎండీవో శ్రీనివాస్‌రావు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాలెపు రామారావు, రైతు సమితి జిల్లా మండల ప్రతినిధులు పసుపర్తి చందర్రావు, లక్కినేని రఘు, డిసిసిబి డైరక్టర్ బోబోలు లక్ష్మణ్‌రావు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ.ఇస్మాయిల్, ఎంపీటీసీలు కొండూరు కిరణ్ కుమార్, ఉప్పు సుబ్బారావు పాల్గొన్నారు.