Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోలీస్ కమిషనర్‌కు మార్కెట్ ఛైర్పర్సన్ వినతి
నవతెలంగాణ-గాంధీచౌక్
ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్‌కు రోజురోజుకు మిర్చి పంట ఉత్పత్తి పెరుగుతున్నందున క్రయవిక్రయాలకు విఘాతం కలగకుండా అదనపు భద్రత కల్పించాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆమె మార్కెట్ సెక్రటరీ ఆర్.మల్లేషంతో కలిసి జిల్లా పోలీసు జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణువారియర్కు ఇందుకు సంబంధించి వినతి పత్రం అందజేశారు.పంట చేతికి వచ్చే సమయం కావడంతో మార్కెట్‌కు నిత్యం పొరుగు జిల్లాల నుంచి వందలాది మంది రైతులు తీసుకు వస్తున్నారన్నారు. దీంతో మార్కెట్‌కు అదే తరహాలో వాహనాల తాకిడి పెరిగిందని ఆమె సీపికి వివరించారు. ట్రాఫిక్ సమస్య శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా క్రయ విక్రయాలు సజావుగా జరిగేందుకు అదనపు భద్రత కోరినట్లు ఆమె తెలిపారు.