Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరవీరుల త్యాగాలు నేటి యువతరానికి, ప్రజలకు స్ఫూర్తిదాయ కమని సిపిఎం సీనియర్ నాయకులు మాదినేని నారాయణ కొనియాడారు. మండల పరిధిలోని గోవిందాపురం ఎల్ గ్రామంలో అమరవీరుల వర్ధంతి సభను సిపిఎం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహిం చారు. అదేవిధంగా జొన్నలగడ్డ రామయ్య వర్ధంతిని కూడా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్థూపాల కు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాదినేని నారాయణ లక్ష్మీపురం సి ఎస్ ఎల్ ఎస్ అధ్యక్షులు మాది నేని వీరభద్రరావు మాట్లాడుతూ ఆనాడు గోవిందపురం ఎల్ గ్రామం వీర తెలంగాణ సాయుధ పోరాటానికి కేంద్రబిందువుగా ఉందన్నారు. అనేకమంది ఈ ప్రాంతం నుంచి తెలంగాణ పోరాటంలో పాల్గొని తమ ప్రాణాలు అర్పించారన్నారు. చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం నిలిచిపోయింది అన్నారు. నైజాం నవాబుకు వ్యతిరేకంగా తెలంగాణ పోరాటం సాగిందన్నారు. కమ్యూనిస్టులు వీర తెలంగాణ పోరాటానికి నాయకత్వం వహించారన్నారు. వీర తెలంగాణ రైతాంగ పోరాట దళాల నాయకుల సమాచారం చెప్పాలంటూ ఈ ప్రాంతంలో నైజాం సైన్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అయినా దళాలు తమ పోరాటాన్ని కొనసాగించారన్నారు. ఈ పోరాటంలో పదిలక్షల భూమిని పేద ప్రజలకు పంచి పెట్టారన్నారు. నిజాం సైన్యం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో తొమ్మిదిమంది పోరాట యోధులను బంధించి గోవింద పురం ఎల్ గ్రామం తీసుకువచ్చారని తెలిపారు. తొమ్మిది మందిలో ఇద్దరిని విడిచి పెట్టి మిగిలిన ఏడుగురిని గ్రామస్థుల సమక్షంలో నిజాం సైన్యం కాల్చిచంపిరన్నారు. ఏడుగురి మతదేహాలను గ్రామంలో ఉరేగిస్తూ మీ అందరికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారని తెలిపారు. అనంతరం గ్రామంలోని దహన సంస్కారాలు నిర్వహించారు. ఆ పోరాట యోధులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న అమరవీరుల సంస్మరణ సభను సిపిఎం ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉమ్మనేని రవి, ఏడునూతన లక్ష్మణరావు, పొన్నం రాంబాబు, కళ్యాణపు బుచ్చయ్య, కారంగుల చంద్రయ్య, కొమ్ము కమలమ్మ , జొన్నలగడ్డ సునీత, నల్లమోతు వాణి, ద్రోణాదుల బ్రహ్మం, కొత్త పల్లి రమేష్, పసుపులేటి నరేష్, కన్నెపోగు బాబు, వల్లం కొండ సురేష్, ఏసుపోగు బాబు, కళ్యాణపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.