Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జాతీయ స్థాయి కరాటే ఛాంపియనషిప్ పోటీలకు ఎంపిక
అ క్రీడాకారులను అభినందించిన డీఎస్పీ
నవతెలంగాణ-కొత్తగూడెం
థైక్వాండో క్రీడా వలన ఆత్మరక్షణకు, ఆత్మస్థైర్యానికి ఉపయోగపడుతుందని కొత్తగూడెం డీఎస్పీ జి.వెంకటేశ్వర్ బాబు అన్నారు. ఈ నెల 6,7 తేదీలలో వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన జాతీయ స్థాయి కరాటే థైక్వాండో ఛాంపియనషిప్ పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. వారిని శుక్రవారం థైక్వాండో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, థైక్వాండో మాస్టర్ మొగిలి ఆధ్వర్యంలో పాల్గొన్న క్రీడాకారులను డీఎస్పీ అభినందించారు. అత్యంత ప్రతిభ కనబర్చి, పలు పతకాలను సాధించడం గర్వకారణమన్నారు. జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాస్టర్ మొగిలిని ప్రత్యేకంగా అభినందించారు.
పతకాలు సాధించిన వారువీరే...
థైక్వాండో 14 సంవత్సరాలలోపు బాలుర విభాగంలో కె.అభి, ఎన్.ప్రణరు కుమార్ బంగారు పతకం, టి.గణేష్,సిహెచ్.శ్రీఅవినాష్, టి.ఈశ్వర్ చరణ్ సిల్వర్ పతకం, ఎల్.భరత్ రెడ్డి, కె.పార్ధు బ్రాంజ్ పతకం సాధించారు. బాలికల విభాగంలో టి.నందిత బ్రాంజ్ మెడల్, సాయి పూజిత గోల్డ్ మెడల్ సాధించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ నిట్ట.ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ ఎన్. నిరంజన్, టి.లక్ష్మణ్, రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ పి.కాశీ హుస్సేన్, వెయిట్ లిఫ్టింగ్ చైర్మన్ కె.కృష్ణారావు, చెస్ అసోసియేషన్ సెక్రెటరీ పి.గోపి కృష్ణ తదితరులు అభినందించారు.